Karthika Deepam2: బంధం తెంచుకున్న కార్తీక్.. బావే కావాలంటూ జ్యోత్స్న ఫైట్!
on Oct 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం2'( Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-165లో.. పరువు, మర్యాదల కోసం మనవరాలి జీవితాన్నే నాశనం చేశాడు ఈ పెద్దమనిషి అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న.. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావ్... దీన్ని ఇక్కడితో ఆపెయ్ అని దశరథ్ అంటాడు. ఏం తాత రెండు పెళ్లిళ్లు చేసుకుంటే పోని పరువు.. మావయ్య చేసుకుంటే పోయిందా అని జ్యోత్స్న అంటుంది. నా తండ్రిని ఇంత మాట అంటావా నిన్ను అంటూ జ్యోత్స్నని కొట్టడానికి చేయి ఎత్తుతాడు దశరథ్. వెంటనే శివన్నారాయణ ఆపుతాడు. ఏంట్రా ఇది.. ఈడొచ్చిన ఆడపిల్ల మీద చేయి వేసుకుంటావా.. అది ఆవేశంలో మాట్లాడుతుంటే నువ్వు కూడా ఆవేశపడితే ఎలా అని శివన్నారాయణ అంటాడు. ఆవేశం కాదు నాన్నా.. మనం అంతా ఆలోచించేది దీని కోసమే కదా.. అయినా దీనికి ఎందుకు అర్థం కావడం లేదని దశరథ్ అంటాడు.
మా పదేళ్ల వయసులో మా అమ్మ చనిపోతే.. మమ్మల్ని చూసుకోవడానికి ఆడ తోడుకావాలని మా కోసం పారిజాతం పిన్నిని పెళ్లి చేసుకున్నాడు.. కానీ మీ మావయ్య భార్య బతికి ఉండగానే.. భార్యకు తెలియకుండా భార్యను మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నాడు.. తిను నా భార్య అని మీ మావయ్య పదిమందిలో ఆ రెండో భార్య గురించి చెప్పగలడా? చెప్పలేడు. అది తాళి కట్టినా కూడా అక్రమసంబంధమే.. అలాంటి ఇంటికి నిన్ను పంపిస్తే.. నువ్వు నీ పిల్లలు ఆ నిందలను మోస్తూ బతకాలి.. దొంగలా ఎంతకాలం తిరుగుతారంటూ దశరథ్ మాట్లాడుతూనే ఉంటాడు. చూడు జ్యోత్స్నా.. నువ్వు ఈ ఇంటి వారసురాలివమ్మా.. మా తర్వాత ఈ ఆస్తుల్ని ఈ గౌరవాలని కాపాడాల్సింది నువ్వే అని దశరథ్ అంటాడు. నాకు అవన్నీ ఏమీ వద్దు.. మా ఇద్దరికీ పెళ్లి చేయండి చాలని జ్యోత్స్న అంటుంది. మీ నాన్న నీకు ఇంత చెప్పినా అర్థం కాలేదని మాట అని శివన్నారాయణ అంటాడు. ఎవరు ఎంత చెప్పినా నేను వినను.. నాకు అర్థం కాదు.. బావతో నాకు పెళ్లి చేస్తారా కాదా అని జ్యోత్స్న అంటుంది. తీసుకున్న నిర్ణయంలో మార్పులేదు.. ఈ పెళ్లి జరగదని దశరథ్ కోప్పడతాడు. అయితే మీకు నచ్చినట్లే చేసుకోండి. నాకు బావ కావాలి.. బావ కావాలి.. బావ కావాలంటూ జ్యోత్స్న అరుస్తుంది. ఇక మరోవైపు దీపని పారిజాతం తిడుతుంది. అప్పుడే అనసూయ వచ్చి పారిజాతానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది.
శ్రీధర్ కొబ్బరి బొండాలు కొనడానికి వచ్చినప్పుడు.. కార్తీక్ కన్పిస్తాడు. అతను మాట్లాడటానికి ట్రై చేస్తుంటే మొదట నిరాకరిస్తాడు. కానీ శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తాడు. మావయ్య తాతయ్య ఇంటికి వచ్చి.. ఇలాంటి కుటుంబం నుంచి సంబంధం వద్దు అనుకుంటున్నామని చెప్పారు.. వాళ్లు తెంచుకున్నది సంబంధాన్నే కాదు బంధాన్ని కూడా, నా తల్లికి మెట్టినింటినీ పుట్టినింటినీ ఒకేసారి దూరం చేశారు మీరు.. మిమ్మల్ని నాన్న అని పిలవడానికే ఈ కొడుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆలోచించుకో.. ఇంట్లో ఉండాల్సిన జీవితాలను నడిరోడ్డు మీదకు తీసుకొచ్చావ్... నాన్నా ఒకటి చెప్పు.. మేము ఏం తప్పు చేశాము.. మేము ఏం అన్యాయం చేశాము.. అమ్మ దగ్గర ఏదైనా దాస్తే ఆ రోజు నిద్రపట్టదు కదా.. నువ్వు ఎలా ఉన్నావ్ నాన్నా అంటూ కార్తీక్ అడుగుతాడు. నేను చాలా సార్లు నిజం చెప్పాలని అనుకున్నాను రా.. కానీ చెప్పలేకపోయానని శ్రీధర్ అంటాడు. ఎందుకు.. అమ్మని చంపడానికా.. నేను చెప్పలేకేనా నిజాన్ని ఇంతకాలం గుండెల్లో దాచుకుని ఏడ్చానని కార్తీక్ అంటాడు. ఆ మాటలకు శ్రీధర్ మరింత షాక్ అవుతాడు. కాసేపటికి కార్తీక్ వచ్చాడంటూ శౌర్య వెళ్తుంది. కార్తీక్‌ని హత్తుకుని మరిచిపోయావా కార్తీక్ నన్ను అని అడుగుతుంది. కార్తీక్ కాస్త కోపంలోనే ఉండి ఏదో సమాధానం చెబుతూ ఉంటే దీప వస్గుంది. శౌర్య నువ్వు వెళ్లి ఆడుకో.. కార్తీక్ బాబుని విసిగించకని పంపేస్తుంది. దీప, కార్తీక్‌లు మాట్లాడుకోవడం పైనుంచి జ్యోత్స్న, పారిజాతాలు చూస్తారు. అమ్మ ముందు తాతయ్యను మావయ్యను నిలదీస్తే అమ్మ బాధపడుతుందని ఆగాను. ఇప్పుడు తేల్చుకోవడానికే వచ్చాను దీపా అని లోపలికి వెళ్తాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read